కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న హోం మంత్రి

ABN , First Publish Date - 2021-08-27T19:02:15+05:30 IST

మైసూరు నగరం శివార్లలో కాలేజీ అమ్మాయి‌పై గ్యాంగ్ రేప్ కేసులో కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి ..

కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న హోం మంత్రి

బెంగళూరు: మైసూరు నగరం శివార్లలో కాలేజీ అమ్మాయి‌పై గ్యాంగ్ రేప్ కేసులో కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని శుక్రవారంనాడు ఆయన మీడియా ముందు వివరణ ఇచ్చారు.


అర్ధరాత్రి వేల నిర్జన ప్రదేశంలోకి కాలేజీ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎందుకు వెళ్లాలి? అలా వెళ్లకుండా ఉండాల్సింది. అలాంటి సమయంలో అందరినీ ఆపడం మనకు సాధ్యం కాదు. కాలేజీ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే కుళ్లు రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద 'రేప్' చేస్తున్నారని హోం మంత్రి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై పార్టీ అధికారిక ట్విట్టర్‌లో కాంగ్రెస్ మండిపడింది. మంత్రి పదవి కోసం లాబీలు చేయడం కాదు, ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలే కానీ, అసమర్థుడిగా మాట్లాడటం మీ సంస్కారానికి నిదర్శనమంటూ విరుచుకుపడింది. హోం మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీ హయాంలో రాత్రి 7.30 గంటలకు కూడా బయటకు రావడం ప్రమాదకరమనే సంకేతాలిస్తోందని ఎద్దేవా చేసింది. దీనిపై జ్ఞానేంద్ర స్పందిస్తూ, ఎవరి మనోభావాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.

Updated Date - 2021-08-27T19:02:15+05:30 IST