లాయర్‌కు కరోనా..కోర్టుకు తాళం!

ABN , First Publish Date - 2020-07-09T22:09:41+05:30 IST

మైసురు నగరంలోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయవాదికి కరోనా సోకినట్టు బుధవారం వెలుగులోకి రావడంతో అక్కడి అధికారులు కోర్టును మూసివేశారు.

లాయర్‌కు కరోనా..కోర్టుకు తాళం!

బెంగళూరు: మైసురు నగరంలోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయవాదికి కరోనా సోకినట్టు బుధవారం వెలుగులోకి రావడంతో అక్కడి అధికారులు కోర్టును మూసివేశారు. శానిటైజేషన్ పూర్తైన తరువాత మళ్లీ కోర్టు తెరుచుకుంటుందని వారు తెలిపారు. బాధితుడు క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాది అని సమాచారం. అంతకుమునుపు అతడు..విధి నిర్వహణలో భాగంగా జడ్జీలు, డెస్కు క్లర్కులను కలిసాడని మైసూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు.  ఇక తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇప్పటి వరకూ 28,877 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,026 కేసులు వెలుగు చూశాయి. వీటిలో అధికశాతం కేసులు రాజధాని బెంగళూరు లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. 


Updated Date - 2020-07-09T22:09:41+05:30 IST