కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి

ABN , First Publish Date - 2021-04-16T06:57:10+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు.

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి
వ్యాక్సిన్‌ వేయించుకున్న దంపతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

వేములవాడ, ఏప్రిల్‌ 15: కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న పలువురితో మాట్లాడారు. వ్యాక్సిన్‌ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది కలిగిందా..? అని రమేశ్‌-భాగ్యమ్మ దంపతులను అడిగి తెలుసుకున్నారు. టీకా తీసుకున్న వారంతా చుట్టుపక్కల వారికి దీని గురించి వివరించాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వ్యాక్సిన్‌ ద్వారా మాత్రమే కరోనా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున పట్టణంలోని సినారే కళా మందిరంలో మరో  కేంద్రం ఏర్పాటు చేయాలని డాక్టర్‌ నళిని, డాక్టర్‌ మానసలను ఆదేశించారు. 

- బోయినపల్లి: వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభా స్కర్‌ సూచించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్‌ టెస్టులను పెంచాలని డాక్టర్‌ సౌమ్యను అదేశించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు  అవగాహన కల్పించాలని సూచించారు. 


Updated Date - 2021-04-16T06:57:10+05:30 IST