Jul 22 2021 @ 13:46PM

'గోపిచంద్ 30'లో నభా నటేష్..?

మాస్ హీరో గోపీచంద్ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. 'గోపిచంద్ 30'గా తెరకెక్కనున్న ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న దీనికి సంబంధించిన నటీ నటుల ఎంపికను మొదలుపెట్టారట. ఇందులో భాగంగా హీరోయిన్‌గా నభా నటేష్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఆమెనే ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. గతంలో గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్‌లో 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలు వచ్చి హిట్స్‌గా నిలిచాయి. దాంతో ఈ హ్యాట్రిక్ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.