May 16 2021 @ 17:19PM

ఈ సారి నభాకి హిట్టు పడాల్సిందే

నభా నటేష్‌కు ఇప్పుడు నటిస్తున్న సినిమాతో ఖచ్చితంగా హిట్టు పడాల్సిందేనని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారట. అందం, అభినమయం ఉన్న లక్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటికే ఈమె కెరీర్ కొంత డైలమాలో పడింది. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నభా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్‌'తో మంచి హిట్ అందుకుంది. ఇస్మార్ట్ బ్యూటీగా క్రేజ్ రావడంతో చక చకా సినిమాలను సైన్ చేసేసింది. వరసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్‌'లలో సందడి చేసిన ఈమెకు చెప్పుకునే హిట్ ఒక్కటి లేకుండా పోయింది. దాంతో ప్రస్తుతం అమ్మడి కెరీర్ నితిన్ సరసన నటిస్తున్న 'మాస్ట్రో' సినిమా మీదే ఆధారపడి ఉంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'అంధాదున్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న 'మాస్ట్రో'కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో రాధిక ఆప్టే పోషించిన పాత్రలోనే నభా కనిపించబోతోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఈమెకి తెలుగులో క్రేజ్ పెరుగుతుంది. లేదంటే డైలమానే అనే మాట వినిపిస్తోంది.