Abn logo
Sep 23 2021 @ 23:07PM

డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్‌ బృందం

కళాశాలలో పర్యటిస్తున్న న్యాక్‌ త్రిసభ్య కమిటీ సభ్యులు

చెన్నూరు, సెప్టెంబరు 23:  చెన్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్‌ త్రిసభ్య కమి టీ సభ్యులు గురువారం సంద ర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె. శ్రీదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ తిరుపతి, బోధన, బోధనేతర సిబ్బందితో న్యాక్‌ బృందం చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణన్‌భాస్కర్‌, డాక్టర్‌ సోవరాణి బోర్కోతోకిసర్మాహ్‌, డాక్టర్‌ మీనాక్షి కందిమత్‌లు సమీ క్షించారు. విద్యార్థులతో ముఖా ముఖి  చర్చ ద్వారా వివరాలు సేకరించారు. కళాశాల వస తులు, బోధన తీరుపై పర్యవే క్షించారు. బృందం పర్య టన సందర్భంగా విద్యార్థులు సాం స్కృతి ప్రదర్శనలను సభ్యులు అభి నందించారు. వీరితో పాటు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిష నరేట్‌ కార్యాలయం సంయుక్త సంచా లకులు జేడీ డాక్టర్‌ డీఎస్‌ రాజేం దర్‌సింగ్‌ విద్యార్థులతో మాట్లా డారు. కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.