ఆగస్ట్ ఒకటి నుంచి.. ఎన్‌ఏసీహెచ్ నిబంధనల్లో మార్పు

ABN , First Publish Date - 2021-07-28T00:12:42+05:30 IST

ఆగస్టు ఒకటి నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. వీటిలో... లోన్ ఈఎంఐ అంశం కూడా ఒకటి.

ఆగస్ట్ ఒకటి నుంచి.. ఎన్‌ఏసీహెచ్ నిబంధనల్లో మార్పు

హైదరాబాద్ : ఆగస్టు ఒకటి నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. వీటిలో... లోన్ ఈఎంఐ అంశం కూడా ఒకటి. ఈ క్రమంలో... బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని ఉంటే... ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలు మారబోతున్నాయి. ఈ సేవలు ఇక నిత్యం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో... లోన్ ఈఎంఐ చెల్లించే వారు అప్రమత్తంగా లేనిపక్షంలో పెనాల్టీల బాదుడు భరించాల్సి ఉంటుంది.


సాధారణంగా ఆదివారం సహా ఇతర బ్యాంక్ హాలిడేస్ వంటివి వస్తే... ఆ రోజు లోన్ ఈఎంఐ కట్ కాదు. మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు అలానే ఉంటాయి. తర్వాతి రోజున అంటే వర్కింగ్ డే రోజున లోన్ ఈఎంఐ డబ్బు బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. ప్రస్తుతం ఇలానే జరుగుతోంది. కాగా... ఒకటో తేదీ నుంచి మాత్రం.. ఆదివారాలు, బ్యాంక్ హాలిడేస్‌తో నిమిత్తం లేకుండా మీ ఈఎంఐ ఏ రోజు ఉంటే ఆ రోజు డబ్బులు కట్ అవుతాయి. అందువల్ల బ్యాంక్ హాలిడేనే కదా అని డబ్బు పెట్టుకోకపోతే ఈఎంఐ కట్ అవ్వదు. అదే జరిగితే...  బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. 

Updated Date - 2021-07-28T00:12:42+05:30 IST