అవినీతి కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడి పాత్ర?

ABN , First Publish Date - 2020-05-28T11:08:16+05:30 IST

అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించింది....

అవినీతి కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడి పాత్ర?

హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి రాజీనామాకు నడ్డా ఆమోదం

న్యూఢిల్లీ : వైద్య ఉత్పత్తుల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ వైద్య ఉత్పత్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ తాను హిమాచల్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీవ్ బిందాల్ ప్రకటించారు. రాజీవ్ బిందాల్ ఈ ఏడాది జనవరి నెలలోనే హిమాచల్ బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దానికి ముందు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేశారు. రాజీవ్ బిందాల్ చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. 

Updated Date - 2020-05-28T11:08:16+05:30 IST