Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాడు నేడు పనులతో పాఠశాలల అభివృద్ధి

పెదవేగి, నవంబరు 30: ప్రభుత్వం చేపట్టిన నాడు– నేడు పనులతో పాఠశాలకు కొత్తరూపు వచ్చి, పాఠశాలల అభివృద్ధి సాధ్యపడిందని విద్యాశాఖ ఆర్జేడీ మధుసూదనరావు అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పెదకడిమిలోని డీఎడ్‌ కళాశాలను తనిఖీ చేశారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నాడు– నేడు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని ఆయన చెప్పారు. నాడు– నేడు రెండోదశకు జిల్లాలో 900 పాఠశాలలను ఎంపి చేశామన్నారు. కొప్పాక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రమాదేవిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్‌.బుధవాసు, టీటీఎఫ్‌.రూజ్‌వెల్టు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement