Sep 23 2021 @ 11:22AM

Naga chaitanya : హారర్ వెబ్ సిరీస్ లో విలన్ గా

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను విడుదలకు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య.. ఆ సినిమాకి సంబంధించిన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో చైతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. అందులో ఆయన  డిజిటల్ డెబ్యూ ఒకటి. చైతూ ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెయ్.. ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు నాగచైతన్య రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఇంతకు ముందు విక్రమ్ కుమార్ .. అక్కినేని వారి మెమరబుల్ ఫ్యామిలీ మూవీ ‘మనం’ కి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్యతో ‘థాంక్యూ’ అనే థ్రిల్లర్ మూవీని కూడా రూపొందిస్తున్నారు విక్రమ్. ఆయన చెప్పిన స్టోరీకి బాగా ఇంప్రెస్ అయిన చైతూ.. అందులో నెగెటివ్ రోల్ చేయడానికి అంగీకరించారట. ఆల్రెడీ చైతూ సతీమణి సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ లో  నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చైతూ వంతు వచ్చింది. మరి ఈ  హారర్ వెబ్ సిరీస్ తో ఆయన  ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.