Abn logo
Jun 6 2020 @ 17:51PM

చైతు తేలిగ్గా మోసపోతాడా!

మన హీరోలలో ఒక్కొక్కరిదీ ఒక్కో తత్త్వం. అయితే తండ్రీకొడుకులు ఇద్దరి సరసనా నటించిన హీరోయిన్లూ కొందరుంటారు. వాళ్ళయితే ఎవరి నేచర్ ఎలాంటిదిదో విడమర్చి చెబుతారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులకైతే అలాంటి అనుభవం మరీ ఎక్కువ. ఇటీవల నటుడు, రచయిత, దర్శకుడు పోసాని సైతం అలాంటి ఓ అనుభవాన్ని విడమర్చి చెప్పారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబంలోని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తో తన మనసులో మాటను బయట పెట్టాడు. నాగ్, చైతు, అఖిల్ ముగ్గురిలో చైతు మేలిమి బంగారమంటూ పోసాని కితాబిచ్చాడు.


అక్కినేని నాగేశ్వరరావే కాకుండా ఆ ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించిన అనుభవం పోసానిది. రచయితగానూ వీరందరినీ చాలా దగ్గరగా గమనించిన పోసాని... వ్యక్తిగా తన ఓటు మాత్రం చైతుకే అంటున్నాడు. అతనో తెల్లకాగితం లాంటివాడని, ఒక్క మాటలో చెప్పాలంటే గౌతమ బుద్ధుడని చెప్పాడు. నాగచైతన్య ఎవరినైనా తేలిగ్గా నమ్ముతాడని, అందువల్ల మోసం చేయడం చాలా తేలికని, ఎవరైనా అతనితో ఠక్కున ప్రేమలో పడిపోతారని అన్నాడు. మోసం, కల్లాకపటం, ఆర్టిఫిషియల్‌గా ఉండటం చైతుకు అసలు తెలియదన్నాడు. పోసాని కృష్ణ మురళి ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అందువల్ల అతని మనసులోంచి వచ్చిన ఈ మాటలు విని... చైతు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు!

Advertisement
Advertisement
Advertisement