May 7 2021 @ 23:11PM

ఇండియాకు వస్తున్నారు

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా ‘థాంక్యూ’ ఇటలీ షెడ్యూల్‌ శుక్రవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇంటి(ఇండియా)కి తిరిగొస్తున్నామని ఆయన చెప్పారు. ఇటలీ లొకేషన్‌లో చైతన్యతో దిగిన సెల్ఫీని కథానాయిక రాశీ ఖన్నా సామాజిక మాధ్యమాలో పంచుకున్నారు. ఆమెతో పాటు సినిమాలో మరో కథానాయికగా నటిస్తున్న అవికా గోర్‌ సైతం ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.


కరోనా నేపథ్యంలో సినిమా షెడ్యూల్‌ను సగంలో ముగించుకుని ‘థాంక్యూ’ టీమ్‌ ఇండియా తిరిగి వస్తోందని వదంతులు వినిపించినప్పటికీ... అలాంటిది ఏమీ జరగలేదు. ‘మనం’ తర్వాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బీవీఎస్‌ రవి కథ అందించారు.