Jul 3 2021 @ 13:12PM

'రెడ్' డైరెక్టర్‌తో నాగ చైతన్య..?

'రెడ్' సినిమాతో రామ్ పోతినేనికి హిట్ ఇచ్చిన డైరెక్ట కిషోర్ తిరుమల. ఈ డైరెక్టర్‌తో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు 'థాంక్యూ' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవగానే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రాకముందే, మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్‌లో కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. కిషోర్ తిరుమల ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'ఆడాళ్లూ మీకు మీ జోహార్లు' తెరకెక్కిస్తున్నాడు. ఇది కంప్లీట్ కాగానే నాగ చైతన్యతో సినిమా మొదలు పెట్టనున్నట్టు సమాచారం. మరి దీనిపై స్పష్టత ఎప్పుడు రానుందో చూడాలి.