May 4 2021 @ 12:22PM

అమెజాన్ ప్రైమ్‌తో నాగచైతన్య ఒప్పందం

అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న తాజా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నాగచైతన్య భార్య సమంత.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. సమంత ఫస్ట్ వెబ్ సిరీస్ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2పై అటు అక్కినేని అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొనడంతో పాటు అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డిజిటల్ ఎంట్రీకీ రెడీ అవుతున్నాడనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో నాగచైతన్య ఒప్పందం చేసుకున్నట్టు తాజా సమాచారం.


అయితే నాగచైతన్య .. సమంత మాదిరిగా హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడా లేక తెలుగు వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే నాగార్జున కూడా ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో త్వరలో నాగార్జున డిజిటల్ ఎంట్రీ ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంతలోనే నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీపై వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు తండ్రి నాగార్జున కంటే ముందే చైతూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...