Abn logo
Oct 28 2020 @ 13:34PM

మరో సినిమాను ప్రారంభించిన నాగశౌర్య!

Kaakateeya

యంగ్ హీరో నాగశౌర్య మంచి జోరుమీదున్నాడు. స్వంత నిర్మాణంలో మరో సినిమాను ప్రారంభించాడు. `అలా ఎలా`, `లవర్` చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.


తాజాగా ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నాగశౌర్యపై క్లాప్ ఇవ్వగా.. మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశి స్క్రిప్ట్‌ని డైరెక్టర్ చేతికి అందించారు.


ఫొటోల కోసం క్లిక్ చేయండి



Advertisement
Advertisement