Jul 23 2021 @ 19:45PM

నా తమ్ముడు బ్రహ్మాజీని సపోర్ట్ చేయండి: నాగశౌర్య ట్వీట్ వైరల్

తాజాగా సోషల్ మీడియా యంగ్ హీరో నాగశౌర్య చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నటుడు బ్రహ్మాజీ, తను ఉన్న పిక్‌ని షేర్ చేసిన నాగశౌర్య ‘‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి కావాలి. దయచేసి కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించండి’’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇది నాగశౌర్య చేస్తున్న చిత్రంలోని వర్కింగ్ స్టిల్ అని చిత్రయూనిట్ పేర్కొంది. డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్‌ చేసే హిలేరియస్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను హీరో నాగశౌర్య షేర్‌ చేశారు. ఈ వర్కింగ్‌ స్టిల్‌, అలాగే నాగశౌర్య కామెంట్ చూస్తుంటే.. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. నాగశౌర్యకు జోడీగా షీర్లే సేతియా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, ఇప్పటి ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు రాధిక ఈ ఓ కీలక పాత్రను చేస్తోంది. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సర్‌ప్రైజింగ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు టైటిల్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.