Abn logo
Aug 14 2020 @ 12:18PM

ఈ రోజు నుంచి నిహారిక నీ సమస్య: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ  చైతన్య ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం గురువారం సాయంత్రం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


తనకు కాబోయే అల్లుడు చైతన్యను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు. `డియర్‌ చై.. దాదాపు చాలా విషయాల్లో నిహారిక నాలాగే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా తనపై కురిపిస్తావని నమ్ముతున్నాను. ఇక, ఈ రోజు నుంచి అధికారికంగా ఆమె నీ సమస్య` అని ట్వీట్ చేశారు. నిహారిక సోదరుడు వరుణ్ కూడా ఎంగేజ్‌మెంట్ గురించి ట్వీట్ చేశాడు. `నా సోదరి ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. కుటుంబంలోకి స్వాగతం బావా` అని కామెంట్ చేశాడు. 




Advertisement
Advertisement
Advertisement