Abn logo
Jan 25 2021 @ 16:11PM

ఆమిర్ సినిమాలో నాగ చైతన్య?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నాడా? ప్రముఖ కథానాయకుడు ఆమిర్ ఖాన్ సినిమాలో మెరవనున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమిర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 


ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నాడట. ఇప్పటికే చిత్రబృందం నాగచైతన్యతో సంప్రదింపులు జరిపిందట. ఆ సినిమాలో కనిపించేందుకు చైతన్య ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన `ఫారెస్ట్ గంప్` చిత్రం ఆధారంగా `లాల్ సింగ్ చద్దా` తెరకెక్కుతోంది. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement