Abn logo
Oct 11 2021 @ 19:00PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నారు. అక్రమంగా కృష్ణా బేసిన్ నుంచి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడాన్ని అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు జాతీయ జల విధానానికి పూర్తి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేసు వేసి అక్రమ తరలింపులను నిలిపివేయాలని లేఖ ద్వారా సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption