Abn logo
Sep 28 2021 @ 08:27AM

నగరిలో హీరో ప్రభు కుటుంబం...

పుత్తూరు(చిత్తూరు): చిత్తూరు జిల్లా నగరిలోని ఆంధ్ర రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కెజె శాంతి ఇంటికి సోమవారం సాయంత్రం సీనియర్‌ హీరో ప్రభు కుటుంబ సభ్యులు విచ్చేసి అల్పాహారం తీసుకుని వెళ్ళారు. దివంగత శివాజీ గణేషన్‌ అభిమాన సంఘానికి కెజె కుమార్‌ రాష్ట్ర అధ్యక్షునిగా వున్నారు. ఆ అనుబంధంతో తిరుమల దర్శనానికి ప్రభు కుటుంబం వెళ్లే సమయంలో కుమార్‌ ఇంటికి వచ్చి వెళ్లారు.