Abn logo
Apr 9 2020 @ 11:56AM

`గీతగోవిందం` డైరెక్టర్‌పై నాగార్జున ఆగ్రహం?

`గీతగోవిందం` వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు డైరెక్టర్ పరశురామ్. `గీతగోవిందం` తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుని ఆయనకు కథ కూడా చెప్పాడు. అయితే అప్పుడు మహేష్ ఖాళీ లేకపోవడంతో కుదరలేదు. ఇతర హీరోలు కూడా బిజీగా ఉండడంతో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో సినిమా చేయడానికి పరశురామ్ సిద్ధమయ్యాడు. 


14 రీల్స్ బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ తరుణంలో మహేష్ నుంచి పరశురామ్‌కు పిలుపొచ్చింది. దీంతో నాగచైతన్య సినిమాను పరశురామ్ పక్కన పెట్టినట్టు సమాచారం. పరశురామ్ ఇలా చేయడం నాగార్జునకు కోపం తెప్పించిందట. పరశురామ్‌పై నాగార్జున ఆగ్రహంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాల టాక్. అయితే నాగచైతన్య సినిమాను పరశురామ్ పూర్తిగా పక్కన పెట్టలేదని, వాయిదా మాత్రమే వేశాడని మరికొందరు అంటున్నారు. అయితే మహేష్ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నట్టు ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.  

Advertisement
Advertisement
Advertisement