Jun 16 2021 @ 16:34PM

మార్ష‌ల్ ఆర్ట్స్ శిక్ష‌ణ‌లో నాగార్జున‌

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన షూటింగ్‌ను త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఇందులో యాక్ష‌న్ పార్ట్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండ‌టంతో నాగార్జున స్పెషల్‌గా ఇజ్రాయెల్‌కు చెందిన క్రావ్ మెగా, స‌మురై స్వార్డ్ అనే మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నార‌ట‌. ఇందులో నాగార్జున మాజీ రా ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.