తెరుచుకున్న మరో 8 గేట్లు

ABN , First Publish Date - 2021-08-03T08:21:25+05:30 IST

ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో సోమవారం ఉదయం నాగార్జున సాగర్‌ మరో 8 గేట్లను ఎత్తారు. దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు విడుదలవుతోంది.

తెరుచుకున్న మరో 8 గేట్లు

సాగర్‌ 22 గేట్ల నుంచి నీటి 

విడుదల.. పర్యాటకుల సందడి

పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత

నెలలో సముద్రంలోకి 453 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో సోమవారం ఉదయం నాగార్జున సాగర్‌ మరో 8 గేట్లను ఎత్తారు. దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు విడుదలవుతోంది. ప్రాజెక్టులో 587.50 అడుగులు (305.80 టీఎంసీలు) మేర నీరుంది. రాత్రి పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీశైలం గేట్ల నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు, మొదటి జల విద్యుత్కేంద్రం నుంచి 30,182 క్యూసెక్కులు, రెండో జల విద్యుత్కేంద్రం నుంచి 33,549 క్యూసెక్కులు కలిపి మొత్తం 3.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కొనసాగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్‌కు వచ్చారు. కాగా, జూరాలకు సోమవారం 3.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 32 గేట్లను తెరిచి 3,08,576 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేశారు. శ్రీశైలం వైపు 2,80,951 క్యూసెక్కులు వస్తుండగా, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో మాత్రం 4,35,060 క్యూసెక్కులు నమోదైంది.


క‌ృష్ణాబేసిన్



పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,72,710 క్యూసెక్కులను కిందకు పంపుతున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 3.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 17 గేట్లను 2.5మీటర్లు ఎత్తి 3.46 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు, గోదావరి నీరు కూడా కలిపి నెల రోజుల్లో 453 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసింది. ఇందులో కృష్ణా జలాలు 46 టీఎంసీలు కాగా, గోదావరి నీరు 407 టీఎంసీలు. మరోవైపు శ్రీశైలంలో తెలంగాణ పరిధి విద్యుదు త్పత్తి కేంద్రంలో 33,549 క్యూసెక్కులను ఉపయోగిస్తూ 13.990 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పులిచింతలలో 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. 

Updated Date - 2021-08-03T08:21:25+05:30 IST