మళ్లీ తెరుచుకున్న సాగర్‌ గేట్లు

ABN , First Publish Date - 2021-08-09T02:29:24+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్టుగేట్లు ఈ ఎడాది రెండోసారి మళ్లీ తెరుచుకున్నాయి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో

మళ్లీ తెరుచుకున్న సాగర్‌ గేట్లు

నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్టుగేట్లు ఈ ఎడాది రెండోసారి మళ్లీ తెరుచుకున్నాయి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నెల 1వ తేదిన సాగర్‌ క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అఽధికారులు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో రెండు రోజుల క్రితం గేట్లను మూసివేశారు. వరద రాక స్వల్పంగా పెరగడంతో ఆదివారం ఉదయం సాగర్‌ నాలుగు క్రస్టుగేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు(311.7462టీఎంసీలు)గా ఉంది.



Updated Date - 2021-08-09T02:29:24+05:30 IST