Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-08-05T13:11:56+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై

Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 8 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో, అవుట్ ఫ్లో 1,07,462 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.84 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-05T13:11:56+05:30 IST