Abn logo
Sep 22 2021 @ 07:45AM

నాగార్జున సాగర్‎కు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో 60,948 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 67,865 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption