Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..4 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-10-02T13:46:59+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82,771 క్యూసెక్కులుగా
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82,771 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 310.55 టీఎంసీలుగా ఉంది.