Nagarjunasagar ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-11T12:50:36+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 1,37,239 క్యూసెక్కులుగా ఉండగా

Nagarjunasagar ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 1,37,239 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,26,864 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 311.74 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-11T12:50:36+05:30 IST