Abn logo
Aug 4 2021 @ 08:19AM

Nalgonda:నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గింది. వరద తగ్గడంతో అధికారులు 4 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 1,09,246 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 68,190 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులు కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 306 టీఎంసీలు ఉంది.