నాగార్జునసాగర్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-07-10T18:15:19+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో నిల్ అవడంతో నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

నాగార్జునసాగర్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో నిల్ అవడంతో నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్టు సమాచారం. 11 రోజులుగా పోలీస్ పహారాలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినయోగించడంతో ప్రాజెక్ట్‌లలో నీటి మట్టం తగ్గింది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-07-10T18:15:19+05:30 IST