నాగర్ కర్నూలు జిల్లా: పోలీస్ స్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-01-10T16:52:25+05:30 IST

నాగర్ కర్నూలు: జిల్లాలో గిరిజన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

నాగర్ కర్నూలు జిల్లా: పోలీస్ స్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం..

నాగర్ కర్నూలు: జిల్లాలో గిరిజన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని బలన్మరణానికి ప్రయత్నించారు. అక్కడున్నవాళ్లు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. సూర్యనాయక్ తండాకు చెందిన పాండునాయక్, జయ దంపతులు తమ పేరుపై ఉన్న భూమిని సాగుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ వర్గానికి చెందిన పలువురు వారిపై దాడి చేశారు. ఘర్షణలో పాండు నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతే కాకుండా సర్పంచ్ వర్గానికి చెందిన ఠాగూర్, రవి, రాజు ఆ భూమి తమదేనంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఓబుల్ రెడ్డి కూడా సర్పంచ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.


కొల్లాపూర్ పీఎస్‌లో తమకు న్యాయం జరగకపోవడంతో మనస్తాపానికి గురైన గిరిజన దంపతులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలటూ బాధితుడి భార్య జయ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-01-10T16:52:25+05:30 IST