క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చనలు

ABN , First Publish Date - 2022-01-26T06:14:39+05:30 IST

గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లిదళార్చనలు, స్వామికి నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చనలు
కొండపైన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకుడు

యాదాద్రి టౌన్‌, జనవరి 25: గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లిదళార్చనలు, స్వామికి నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయం లో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు.సింధూరం,వివిధ రకాల పూలతో అలంకరించి ఆంజనేయు డి సహస్రనామాలతో నాగవల్లి దళార్చనలు చేశారు. ప్రధానాలయంలో, పుష్కరిణి చెంతనున్న ఆంజనేయస్వామిని వేదమంత్రాలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ప్రధానాలయంలోని స్వయంభువులు,బాలాలయ కవచమూర్తులను కొ లిచిన పూజారులు ఉత్సవమూర్తులను అభిషేకిం చి అర్చించారు. సుదర్శన హోమం,నిత్య కల్యాణపర్వాలను ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజా నాకు రూ.7,30,587 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

పూర్తయిన పరిచారిక, సహాయపాచక అర్హత పరీక్షలు

యాదాద్రి దేవస్థానంలో ప్రధానాలయం, శివాలయంలో ఖాళీ గా ఉన్న పరిచారిక, సహాయ పాచక పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష లు ముగిశాయి. హైదరాబాద్‌లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రధానకార్యాలయంలో మంగళవారం పరిచారిక, సహాయపాచక పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ప్రధానాలయ రామానుజ కూటమిలో 6 సహాయ పాచక పోస్టులకు 10 మంది, శివాలయం లో 2 పరిచారిక పోస్టులకు ఐదుగురు, అన్నదానం పరిచారిక పోస్టుకు ఒకరు, బ్రాహ్మణ సత్రం ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి మౌఖిక, ప్రాక్టకల్స్‌ పరీక్షలు నిర్వహించి మెరిట్‌ ఆధారంగా నియమించనున్నారు.

Updated Date - 2022-01-26T06:14:39+05:30 IST