నాయిని పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-10-22T07:01:28+05:30 IST

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స

నాయిని పరిస్థితి  విషమం

హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన  అపోలో వైద్యులు

కరోనా, న్యూరో సమస్యలతో అదే ఆస్పత్రిలో భార్య అహల్య

ఎదురెదురు గదుల్లో చికిత్స పొందుతున్న దంపతులు 

ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

రాంనగర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన, ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం, మూత్ర పిండాలు దెబ్బతినడంతో అపోలోలో చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రానికి నాయిని పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సాయంత్రం అపోలో ఆస్పత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.  కాగా నాయిని సతీమణి అహల్యకు కూడా కరోనా సోకింది. ఊపిరితిత్తులు, న్యూరో సమస్య రావడంతో ఆమెను కూడా అదే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. క్రిటికల్‌ వార్డులో ఎదురెదురు గదుల్లో నాయిని దంపతులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.  


Updated Date - 2020-10-22T07:01:28+05:30 IST