Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 15 2021 @ 09:48AM

బీజేపీ జిల్లా అధ్యక్షుని ఇంటిలో భారీ పేలుడు

నైనితాల్: ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిస్ట్ హీరాన్గర్ ఇంటిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంటిలోని ప్రధాన గేటు, తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు శబ్ధానికి సమీపంలోని ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ దర్యాప్తు అనంతరమే ఈ పేలుడుకు గల కారణాలు తెలుస్తాయన్నారు. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ముఖ్యమంత్రి పుష్కర్ థామీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement