20 రోజుల క్రితం తప్పిపోయిన మహిళ.. వివస్త్రగా డ్రైనేజీలో!

ABN , First Publish Date - 2021-03-26T02:36:58+05:30 IST

ఇరవై రోజుల క్రితం తప్పిపోయిన ఓ మహిళ.. వివస్త్రగా డ్రైనేజీలో ప్రత్యక్షమైన ఘటన అమెరికాలో చో

20 రోజుల క్రితం తప్పిపోయిన మహిళ.. వివస్త్రగా డ్రైనేజీలో!

వాషింగ్టన్: ఇరవై రోజుల క్రితం తప్పిపోయిన ఓ మహిళ.. వివస్త్రగా డ్రైనేజీలో ప్రత్యక్షమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన ఓ 43ఏళ్ల మహిళ 20 రోజుల క్రితం తప్పిపోయింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఆచూకిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సదరు మహిళ అకస్మాత్తుగా వివస్త్రగా డ్రైనేజీలో ప్రత్యక్షమైంది. ఫ్లోరిడాలోని ఓ రోడ్డుపై ఉన్న డ్రైనేజీ నుంచి ‘నన్ను రక్షించండి ప్లీజ్’ అనే అరుపులు రావడంతో అటు వైపు వెళ్లిన కొందరు ప్రజలు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమెను రక్షించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను.. 20 రోజుల క్రితం తప్పిపోయిన మహిళగా గుర్తించారు. ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఇన్ని రోజులు ఏమైపోయింది. డ్రైనేజీలో ఎలా పడింది. వివస్త్రగా ఉండటానికి గల కారణాలు ఏంటనే వివరాలు ఇంకా తెలియరాలేదు. 


Updated Date - 2021-03-26T02:36:58+05:30 IST