Abn logo
Oct 17 2021 @ 11:50AM

Airport లో నగ్నంగా కలియ తిరుగుతూ.. తోటి ప్రయాణికులను పలకరించిన మహిళ.. పోలీసులు రావడంతో..

డెన్వర్, కొలరాడో: ఒంటిపై నూలు పొగులేకుండా విమానాశ్రయం అంతట కలిగి తిరుగుతూ తోటి ప్రయాణికులను పలకరిస్తుందో మహిళ. పూర్తి నగ్నంగా ఉన్న ఆమె తోటి ప్రయాణికులను ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటూ పలకరిస్తుంది. మహిళ చేష్టలతో నిశ్చేష్టులైన ప్రయాణికులు విమానాశ్రయం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి వచ్చిన పోలీసులు ఆమెను దుప్పటితో కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సదరు మహిళ పోలీసులు చేస్తున్న పనిని చూసి వెటకారంగా నవ్వడం చేసింది. ఈ ఘటన డెన్వర్ విమానాశ్రయంలో గత నెల 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కొలరాడోలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం. సెప్టెంబర్ 19వ తారీఖు, తెల్లవారుజామున 5 గంటలు(అమెరికా కాలమానం ప్రకారం) కావోస్తోంది. ప్రయాణికులందరూ తాము వెళ్లాల్సిన విమానాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఓ మహిళా ప్రయాణికులురాలు విమానాశ్రయమంతా నగ్నంగా కలియ తిరగడం మొదలెట్టింది. అంతేగాక ఎదురుపడిన తోటి ప్రయాణికులను ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటూ కుశల ప్రశ్నలు వేస్తోంది. దాంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టు పోలీసులకు మత్తులో ఉన్న ఓ మహిళ విమానాశ్రయంలో నగ్నంగా తిరుగుతున్నట్లు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే ఆ మహిళ వద్దకు చేరుకున్న పోలీసులు ఆమెకు దుప్పటి అందించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె పోలీసులు ఇచ్చిన బ్లాంకెట్‌ను కూడా పక్కన పడేసి వికటంగా నవ్వడం చేసింది. 

దాంతో ఎలాగోలా ఆమెను పోలీసులు దుప్పటితో కప్పి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఆపై ఆమె మద్యం కూడా సేవించడంతో అలా ప్రవర్తించి ఉంటుందని తెలిపారు. దాంతో పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే, మహిళా ప్రయాణికురాలికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. గత నెలలో అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఇదే తరహా ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ  కేవలం బికినీ వేసుకుని ముఖానికి మాస్కుతో ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.    

ఇవి కూడా చదవండిImage Caption

అమెరికా నగరాల్లోమరిన్ని...