Advertisement
Advertisement
Abn logo
Advertisement

’రామ్‌రాజ్‌’ పేరుతో నకిలీ మాస్కుల తయారీ

 కావలి, ఒంగోలులో విక్రయాలు

  పోలీసులకు ఫిర్యాదు, కేసు దర్యాప్తు

 

కావలి, జూన3: మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉన్న రామ్‌రాజ్‌ కంపెనీ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేసి కావలి, ఒంగోలులో విక్రయించే ముఠాను పోలీసులు అరెస్ట్‌  చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడులోని తిరుపూరు కేంద్రంగా రామ్‌రాజ్‌ కాటన సంస్థ పంచెలు, చొక్కాలు, ముఖకవచాలు(మాస్కులు), లోదుస్తుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఆ ఉత్పత్తులకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణా, కేరళ రాష్ట్రాల్లో మంచి జనాదరణ ఉంది. కరోనా నుంచి ప్రజలకు తగిన రక్షణ కల్పించేలా నాణ్యమైన మాస్కులు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నది. గత నెలలో ఆంధ్రప్రదేశలో రామ్‌రాజ్‌ సంస్థ మాస్కుల విక్రయాలు భారీగా తగ్గిపోవటాన్ని గుర్తించి, దానికి తగిన కారణాలను అన్వేషించింది. ఈ క్రమంలో కావలికి చెందిన షేక్‌ గౌస్‌సందానీ ఓ ఫోన నెంబరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను సృష్టించి మాస్కులు కావాల్సిన వారు ఆ నెంబరును సంప్రదించాలని చెప్పారు. దీంతో రామ్‌రాజ్‌ కంపెనీ వారు దాన్ని తెలుసుకుని ఆ నెంబరు  ప్రకారం ఆర్డరు పెట్టగా రామ్‌రాజ్‌ లోగోతో ఉన్న నకిలీ మాస్కులను పంపారు. రామ్‌రాజ్‌ కంపెనీ వారి లోగో ఎంబ్రాయిడరీలో ఉండగా ఈ నకిలీ కంపెనీ లోగో స్ర్కీన ప్రింట్‌లో ఉంది. దీంతో రామ్‌రాజ్‌ కంపెనీకి చెందిన నెల్లూరు బ్రాంచి మేనేజరు ఏ. కన్నన గత నెల 31న కావలి టూటౌన పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కావలిలో ప్రముఖ రెడీమేడ్‌ దుస్తుల ఉత్పత్తి సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న షేక్‌ గౌస్‌ సందానీ, అదే సంస్థలో పని చేస్తున్న గోపాలకృష్ణనలు కలిసి ఆర్టీజీఎస్‌ ఏజెన్సీస్‌ అనే కంపెనీని ప్రారంభించి నకిలీ మాస్కులు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వారిని అరెస్ట్‌చేసి విచారణ కొనసాగించగా వారి సమాచారం మేరకు ఒంగోలు  బండ్లమిట్టకు చెందిన ఒక టెక్స్‌టైల్స్‌ సంస్థ యజమాని డీ. రాజా నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా నకిలీ మాస్కులు ఒంగోలులో తయారు చేసి అక్కడ నుంచి కావలికి సరఫరా చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో కావలి పోలీసులు ఒంగోలుకు చేరుకుని డీ. రాజాను కూడా అరెస్ట్‌ చేసి, ఆయన వద్ద ఉన్న నకిలీ మాస్కులు, వాటి తయారీకి ఉపయోగించిన క్లాతను స్వాధీన పరుచుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
Advertisement