నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక రేపు

ABN , First Publish Date - 2021-05-06T06:47:44+05:30 IST

నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఈ నెల 7వ తేదీన ఎన్నుకోను న్నారు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక రేపు

నకిరేకల్‌, మే 5: నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఈ నెల 7వ తేదీన ఎన్నుకోను న్నారు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ వాకాటి కరుణ పర్యవేక్షణలో ఎన్ని క జరుగనుంది. 20వార్డుల్లో టీఆర్‌ఎస్‌(11), పార్వర్డ్‌బ్లాక్‌(6), కాంగ్రెస్‌(2), ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 11మంది అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌గా గెలిచిన కౌన్సిలర్‌ కూడా టీఆర్‌ఎస్‌ క్యాంప్‌లోనే ఉన్నట్లు సమాచారం. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిచేశామని మునిసిపల్‌ కమిషనర్‌ బాలాజీ తెలిపారు. 


చైర్మన్‌ పదవి కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ 

చైర్మన్‌ పదవి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో పోటీ నెలకొంది. 20 వార్డుల్లో 11 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్‌ పదవికి ఎన్నిక కావాలంటే  11మంది అభ్యర్థులుండాలి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 11మంది అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా టీఆర్‌ఎస్‌ క్యాంప్‌లోనే ఉన్నట్లు తెలిసింది. చైర్మన్‌ పదవి బీసీ రిజర్వేషన్‌ కావడంతో టీఆర్‌ఎస్‌లో గెలిచిన 11 మందిలో 8మంది బీసీ లే ఉన్నారు. ప్రధానంగా 19వ వార్డు నుంచి గెలిచిన రాచకొండ శ్రీనివాస్‌, 7వ వార్డు నుంచి గెలిచిన కొండ శ్రీను మధ్యనే పోటీ ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల కంటే ముందు మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల ఆశీస్సు లతోనే చైర్మన్‌ పదవి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగు తోంది. క్యాంప్‌లో ఉన్న మం త్రిని ఎమ్మెల్యేను కొండ శ్రీను చైర్మన్‌ పదవి తనకు కూడా అవకాశం కల్పించాలని విన్నవించుకున్నట్లు తెలుస్తుంది.  మంత్రి,  ఎమ్మె ల్యే ఆశీస్సులతోనే ఇద్దరిలో ఒకరికి చైర్మన్‌ పీఠం వరించనుంది. వైస్‌చైర్మన్‌ పదవి మాత్రం 11వ వార్డు నుంచి గెలు పొందిన మురారిశెట్టి ఉమారాణికి ఇచ్చేందుకు మంత్రి, నకిరేకల్‌, తుంగతుర్తి ఎమ్మె ల్యేల ఆశీస్సులు ఉన్నట్లు తెలిసింది. క్యాంప్‌ లో ఉన్న 1వ వార్డు ఇండిపెండెంట్‌ గెలి చిన అభ్యర్ధి కందాళ భిక్షంరెడ్డి వైస్‌చైర్మన్‌ కోసం పోటీ పడుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-05-06T06:47:44+05:30 IST