Abn logo
Sep 19 2021 @ 15:47PM

వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి: నక్కా ఆనంద్‌బాబు

అమరావతి: గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విపరీణమలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా?, వ్యవస్దలు పనిచేస్తు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటికి దాడి వెళ్ళి మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్యన్నారు. పోలీసులు వాళ్ళ చర్యలను సమర్దించడం దుర్మార్గమన్నారు. డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలన్నారు. నా భూతో.. నా భవిష్యతు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఎన్ని భూతులు తిడితే.. మీ భవిష్యతు అంతా బాగుంటుంది అనే రీతిలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తుందని మండిపడ్డారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్  మరియు ఆ రోజు దాడికి వచ్చిన వారిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలని సూచించారు.