Abn logo
Sep 20 2021 @ 17:00PM

తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు: నక్కా ఆనందబాబు

అమరావతి: టీడీపీ ఎన్నికలను బహిష్కించినప్పుడు వైసీపీ ఎన్నికలు జరిపించుకొని తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. జగన్ వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఎన్నికల విధానాన్ని మోసకారి విధానంగా మార్చారని అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వద్ద సలహాదారుగా పనిచేసిన వ్యక్తి, అనేక కోర్డు ధిక్కరణ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నారు. ఎన్నికలప్పుడు తంబళ్లపల్లి, పుంగనూరు, పులివెందుల, శ్రీకాళహస్తి, మాచర్ల, గురజాల తదితర ప్రాంతాల్లో వైసీపీవారు చేసిన దుర్మార్గాలు ప్రజలకు తెలిసినవేనన్నారు. సామాన్యులు ధైర్యంగా, స్వచ్ఛందంగా ఓట్లేసుకునే పరిస్థితిని లేకుండా చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను తుంగలో తొక్కారని వ్యాఖ్యానించారు. రాజకీయ విబేధాలు, కక్షల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను దుర్వినియోగం చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అనవసర కేసులు పెట్టారని మండిపడ్డారు. వాలంటీర్లను నియమించుకొని గ్రామాల్లో చిచ్చు పెట్టారని చెప్పారు. ప్రజలను భాయభ్రాంతాలకు గురిచేసి పాలన సాగిస్తున్నారని అన్నారు. అనాలోచిత, అసందర్భోచిత ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు.