కక్షతో ఆ అధికారులపై అక్రమ కేసులు: నక్కా ‌ఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2021-12-25T17:58:23+05:30 IST

కక్షతో అవినీతి చేయని నిజాయితీపరులైన అధికారులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి నక్కా ‌ఆనంద్‌బాబు అన్నారు.

కక్షతో ఆ అధికారులపై అక్రమ కేసులు: నక్కా ‌ఆనంద్‌బాబు

అమరావతి: కక్షతో అవినీతి చేయని నిజాయితీపరులైన అధికారులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి నక్కా ‌ఆనంద్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నాయి. మీరు నిజాయితీ పరులైతే కోర్టు వాయిదాలకు ఏళ్ల తరబడి ఎందుకు ముఖం చాటేస్తున్నారు?. స్కిల్ డెవలప్ మెంట్‌లో రూ.241 కోట్లకు అవినీతికి పాల్పడ్డారని జేడీ లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావులపై కేసులు బనాయించారు. రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు అన్నిరకాల పరికరాలు సరఫరా చేసినట్టు అధికారులే ఒప్పుకొని సంతకాలు పెట్టాక, అవినీతి ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. కక్ష సాధింపు కోసం అక్రమంగా ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, సంగం డెయిరీలో ధూళ్లిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. రూ.700 కోట్ల ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు. జగతి సంస్థలో జగన్‌రెడ్డి కుటుంబం రూపాయి పెట్టుబడి పెట్టకుండానే రూ.1,246 కోట్లు పెట్టుబడిగా ఎలా వచ్చిందని తెలంగాణ సీబీఐ కోర్టు ప్రశ్నించింది?. విజయసాయిరెడ్డి హెటిరోపై ఐటీ దాడులు చేయగా రూ.1200 కోట్లు అక్రమ ఆస్తులను గుర్తించి సీజ్ చేశారు. జగన్మోహన్‌రెడ్డి రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి 19 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారు. ఇవన్నీ కప్పిపెట్టుకోవడానికే గంటా సుబ్బారావుపై అక్రమ కేసు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టించారు’’ అని నక్కా ‌ఆనంద్‌బాబు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-12-25T17:58:23+05:30 IST