ప్రియుడి పెళ్లితో ప్రియురాలి కలత... వధువు కళ్లకు ఫెవిస్టిక్ అంటించి...

ABN , First Publish Date - 2020-12-03T13:26:34+05:30 IST

బీహార్‌లోని నలంద జిల్లాలో గుండె దడ పుట్టించే ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి తన ప్రియుడు తనను మోసం చేశాడని...

ప్రియుడి పెళ్లితో ప్రియురాలి కలత... వధువు కళ్లకు ఫెవిస్టిక్ అంటించి...

నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలో గుండె దడ పుట్టించే ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి తన ప్రియుడు తనను మోసం చేశాడని నానా హంగామా చేసింది. ఆమె తన ప్రియుడి కొత్త భార్యను పట్టుకుని, ముందుగా ఆమె జుత్తు కత్తిరించింది. తరువాత ఆమె కళ్లను ఫెవిస్టిక్‌తో అతికించేసింది. ఇంతటితో ఆగకుండా ఆమెను చావబాదింది. నలందలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.




మీడియాకు అందిన సమాచారం ప్రకారం నవ వధువుపై దాడికి పాల్పడిన యువతికి ఆ వరునితో అంతకుముందు నుంచే సంబంధం ఉంది. అయితే ఆ యువకుడు ఈ విషయాన్ని దాచిపెట్టి, మరో యువతిని డిసెంబరు ఒకటిన వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు తన ప్రేమికుని ఇంటికి చేరుకుంది. అక్కడ నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతురి జుత్తు కత్తిరించి, ఆమె రెండు కళ్లకు ఫెవిస్టిక్ అతికించింది. బాధతో ఆ కొత్త పెళ్లి కూతురు అరవసాగింది. వెంటనే కుటుంబ సభ్యులంతా అక్కడకు చేరుకున్నారు. వారు ఆ యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన ఆ కొత్త పెళ్లికూతురును చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన చోటుచేసుకున్న మోరా తాలాబ్ గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-12-03T13:26:34+05:30 IST