Abn logo
Sep 21 2021 @ 13:55PM

నల్గొండ మున్సిపాలిటీలో ఉద్యోగుల అరెస్టుల పర్వం

నల్గొండ: మున్సిపాలిటీ ఉద్యోగుల అవినీతి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టుల పర్వం ప్రకంపలను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరస్టయిన వారి సంఖ్య 9కి చేరింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఇంటి అనుమతులకు సంబంధించి ఉద్యోగులు సుమారు రూ. 5 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారు. 2010 నుంచి 2014 వరకు ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ ఆరేళ్ల క్రితం వరకు అవినీతి అవకతవకలకు పాల్పడిన కేసులో ముగ్గురు ఉద్యోగులను శుక్రవారం  పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న క్యాషియర్ అరుణకుమారి ప్రస్తుతం చండూరులో విధులు నిర్వహిస్తున్నారు. ఏ12గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏ16గా ఉన్న బిల్ కలెక్టర్ ఈశ్వర్య నల్గొండలో విధులు నిర్వహిస్తున్నారు.


15వ తేదీన బిల్‌ కలెక్టర్‌ బిక్షం, ఇంచార్జ్‌ బిల్‌ కలెక్టర్‌లు భానుకుమార్‌రెడ్డి, ముంత మల్లెశంను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా 18న ఈ కుంభకోణానికి సంబంధించిన రసీదు పుస్తకాలు మాయం చేసిన ఉద్యోగుల్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండయ్యతోపాటు పృధ్వీరాజ్, రిటైర్డ్ ఉద్యోగి వెంకులను అరెస్టు చేశారు. వారిలో జూనియర్ అసిస్టెంట్ అరుణకుమారి, సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిల్ కలెక్టర్ ఈశ్వరయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption