Abn logo
Oct 12 2021 @ 07:27AM

Nagarjuna sagar ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,72,113 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption