Abn logo
Aug 2 2021 @ 07:59AM

Nalgonda: చిట్యాలలో లారీని ఢీకొన్న ట్రావేల్స్ బస్సు..8 మందికి గాయాలు

నల్గొండ: చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా..డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను, డ్రైవర్‎ను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెలిమినేడు శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.