మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-14T16:53:41+05:30 IST

మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేయడంతో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు.

మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేయడంతో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు. గేట్లు ఎత్తడంతో ఉధృతంగా ప్రవహించే నీటితో ప్రమాదం ఉన్నందున ఎవరూ చేపల వేటకు నదిలోకి వెళ్లొద్దని సూచించారు. మరోవైపు మూసీ ప్రాజెక్ట‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేట్ అడుగు మేర ఎత్తి ఏడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5,500 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,400 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-07-14T16:53:41+05:30 IST