Telangana: మునుగోడులో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-09-03T14:53:22+05:30 IST

జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో చండూర్, మునుగోడు, నాంపల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Telangana: మునుగోడులో భారీ వర్షం

నల్గొండ: జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో చండూర్, మునుగోడు, నాంపల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  కొరటికల్ వాగు, శేషిలేటి వాగు పొంగిపొర్లుతోంది. వర్షపు నీటి చండూరు మండలం జలదిగ్భందంలో ఉండిపోయింది. రోడ్లపైకి  వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణం ప్రమాదంగా మారింది. వరద ఉధృతికి చండూరు, మునుగోడు, నాంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-09-03T14:53:22+05:30 IST