నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-07T17:52:33+05:30 IST

జిల్లాలోని త్రిపురారం మండలం అప్పలమ్మ గూడెంకు చెందిన గుండెబోయిన వెంకటయ్య దారుణ హత్యకు గురయ్యాడు.

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ: జిల్లాలోని త్రిపురారం మండలం అప్పలమ్మ గూడెంకు చెందిన గుండెబోయిన వెంకటయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మిర్యాలగూడ మండలం అన్నారం శివారు గద్దగుడి తండా వద్ద మృతదేహం లభ్యమైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పాత కక్షలు నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-07T17:52:33+05:30 IST