బాబా అవతారమెత్తిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

ABN , First Publish Date - 2021-08-01T15:48:27+05:30 IST

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బాబా అవతారమెత్తాడు. పీఏ పల్లి మండలం అజ్మాపురంలో పది ఎకరాల స్థలంలో...

బాబా అవతారమెత్తిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

నల్లగొండ: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బాబా అవతారమెత్తాడు. పీఏ పల్లి మండలం అజ్మాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. హోమాల పేరుతో మోసాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రోగం నయం చేస్తానని చెప్పి బురిడీ బాబా భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఓ యూట్యూబ్ చానల్ వేదికగా భక్తులను ఆకర్షిస్తున్నాడు. ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో నకిలీ బాబా భాగోతం బట్టబయలయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు బురిడీ బాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకుని, అతని నుంచి నగదు, నగలు, కోట్ల విలువ చేసే ల్యాండ్ డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాబా మోసాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-08-01T15:48:27+05:30 IST