నల్గొండ: జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్పల్లిలో దారుణం జరిగింది. భార్య జక్కల యాదమ్మ(38)ను భర్త నర్సింహా కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.